సతీమణి 'తెలంగాణ మొక్కు' తీరుస్తానన్న కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ తన సతీమణి శోభ తెలంగాణ కోసం పెట్టిన మొక్కును తీర్చబోతున్నారు. ప్రభుత్వ ఖర్చుతో కాకుండా తన సొంత ఖర్చుతో తీర్చబోతున్నట్టు తెలిపారు. సిద్దిపేటలో ఈరోజు జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఈ సందర్భంగా మొక్కు విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ వస్తే సిద్దిపేటలోని కాళేశ్వర స్వామికి బంగారు కిరీటం చేయిస్తానని మొక్కుకున్నట్టు తన భార్య చెప్పిందని, ఆ మొక్కు తీరుస్తానని వివరించారు.